ఖానాపూర్ పట్టణంలో సెప్టెంబర్ 4న జరగనున్న మధ్యాహ్న భోజన యూనియన్ సిఐటియు జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఖానాపూర్ లో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలకు కావస్తున్న ఆ దిశగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల పెండింగ్ బిల్లులు,గౌరవ వేతనం నెలల తరబడి రాకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారన్నారు వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.