డయేరియా కేసులు నమోదు.. పర్యవేక్షించిన తహశీల్దార్ తిరుపతి: రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో డయేరియా కేసులు నమోదై గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు 19 కేసులు గుర్తించగా.. వారిలో 16మందిని ఆసుపత్రిలో చేర్చారు. మరో ముగ్గురు గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఈనేపథ్యంలో తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డి గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించి, ఆరోగ్యసిబ్బందితో మాట్లాడి తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.