ఐ.పోలవరం మండలం మురమళ్ళ 216 జాతీయ రహదారి పక్కన ఆనుకొని ఉన్న షాపులో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బండ లీకై షాపులు దగ్దమయ్యాయి. ఒక్కసారిగా గ్యాస్ బండ పేలడంతో సంఘటనా స్థలం నుండి స్థానికులు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ ఆఫీస్ కి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.