ఏలూరు జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఎమ్మెల్యేలు బాలరాజు, సొంగ రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల అధికారులను ఆదేశించారు.