కోడుమూరు మండలంలోని పులకుర్తి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని సొంత కొడుకు చంపాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామాచారిని కొడుకు రోకలితో కొట్టి చంపాడు. విషయం బయటకు పొక్కడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దారుణంపై ఆరా తీస్తున్నారు.