కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జెడ్ శివ ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో కరోనా కట్టడి విషయంలో చేతులెత్తేశారని సాయంత్రం ఐదు గంటలకి అన్నారు. కరోనా సమయంలో ప్రజలు భయపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.