ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు కార్వేటినగరం పోలీసులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ హనుమంతప్ప మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. యువత హెల్మెట్‌ను తప్పకుండా వాడాలని సూచించారు.