ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా అధికారులను ఆదేశించారు.శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ, ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.