Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 5, 2025
విద్యార్థుల సంక్షేమంలో అలసత్వాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. మంగళవారం మొగుళ్లపల్లి మండలం కోర్కెశాలలోని కెజిబివి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పురుగుపడిన అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వంటవాళ్లను సస్పెండ్ చేశారు. కొత్తగా నియమితులైన వంటవాళ్లతో ముఖాముఖి మాట్లాడి మంచిగా వంట చేయాలని, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని నాణ్యతకు కట్టుబడాలని, పాడైన బియ్యం, సరుకులు వినియోగించొద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని 6