నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్లోని ద్వారక నగర్ లో గల ఉద్దం నవ దుర్గ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, గర్భ, దాండియా ఆడుతూ భక్తులు ఎంతో సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. దుర్గామాతను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తామని.. అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి నృత్యాలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.