కళా ప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు శాఖ మరియు సమైక్య భారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సభకు సహృదయులు తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు గారు అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ అప్పారావు గారు మాట్లాడుతూ భాష ద్వారా సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు అప్పారావు గారు అని సమాజాన్ని జాగృతి చేసిన భాషా వైతాళికుడు గిడుగు రామమూర్తి పంతులు గారని అన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపకులపతి ఆచార్య GP రాజశేఖర్ గారు తెలుగు భాష విశిష్టతను వివరించారు.