రాజమండ్రిలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్ వద్ద సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద బ్యాడ్మింటన్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అని వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో ఇతర దేశాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలియజేశారు.