కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని సోమవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనఖి చేశారు. విధుల్లో క్రమశిక్షణ నిబద్దతపై దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో దసరా మరియు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది గైర్హాజరైన మరియు హాజరైన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.