నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం 10 ట్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో అవుట్లో 1,33,824 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ చర్యతో దిగువ ప్రాంతాలకు నీతి సరఫరా కొనసాగుతుందని తెలిపారు.