నల్లగొండ జిల్లాలోని ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన వ్యాక్సినేషన్ కుక్కల పట్ల ప్రేమ దయను ప్రోత్సహించేందుకు నల్లగొండ జిల్లాలో ఈ నెల 13న కుక్కల దత్తత కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నట్లు గురువారం స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల కాలంలో కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు.