పేద ప్రజలకు సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) వరం లాంటిదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలానికి చెందిన తెవుళ్ల రంగస్వామికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.72,820 విలువ గల చెక్కును ఎంపీ శుక్రవారం పంచలింగాల గ్రామంలోని తన నివాసంలో అందజేశారు.రంగస్వామి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు సమాచారం. వైద్య ఖర్చుల భారం తట్టుకోలేక ఆయన సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ఎంపీ నాగరాజును సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎంపీ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకునేలా మార్గనిర్దేశం చేయడంతో ప్రభుత్వం నుంచి రూ.72,820 ఆర్థిక సహాయం మంజూరైంది.ఈ సందర్