అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పంచాయతీ పరిధిలోని 11 ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 34 మంది ఉపాధ్యాయులను శ్రీ మోకా చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించారు. ట్రస్ట్ అధ్యక్షులు, అయినాపురం గ్రామ సర్పంచ్ మోకా రామారావు మాట్లాడుతూ గురువుల పట్ల గౌరవాన్ని చాటడం ద్వారా సమాజంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు