ఉండిలో ట్రావెల్ బస్సు దొంగల అరెస్ట్ ఉండి మండలం గోరింతోట చర్చి వద్ద ఎల్జీ ట్రావెల్స్ బస్సును అడ్డగించి దొంగతనానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు భీమవరం క్రిమినల్ కోర్టులో హాజరుపరిచినట్లు ఉండి ఎస్ఐ నసీరుల్లా తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన నలుగురు వ్యక్తులు బస్సును ఆపి క్లీనర్ను కొట్టి, అతని వద్ద ఉన్న రూ.1,000 నగదు, సెల్ ఫోన్ను దొంగలించినట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిమని ఎస్ఐ వెల్లడించారు.