తనిఖీల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వే క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్బృం దం ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి బ్యాగుల్లో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్టన్ బాక్స్‌లను తనిఖీ చేయగా, వాటిలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సోమవారం పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న జీఎస్‌టీ, ఆర్‌పీఎఫ్ అధికారులు బాక్స్‌లను తెరిచి చూడగా, వాటిలో కొన్ని నకిలీ పత్రాలు లభ్యమయ్యాయి. దీనిని జీఎస్‌టీ నిబంధనల ఉల్లంఘనగా భావించి, అధికారులు ఇద్దరు వ్యక్తులకు రూ. 7 లక్షల జరిమానా విధించారు.