జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంబోత్సవం, మండలంలోని వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్ద పీట