నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శుక్రవారం ఎస్ఆర్ నగర్ పరిధిలోని బాపూనగర్ యూనియన్ బ్యాంక్ లైన్ లో ఆపరేషన్ రోప్ వే నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్కుకు అంతరాయం కలిగించే ఆక్రమణలను తొలగించారు. నిషేధిత ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలకు చలాన్ విధించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.