వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కప్పగండ్ల గ్రామానికి చెందిన జంగయ్య తన ద్విచక్ర వాహనంపై కిరాణా సామానుకు వెల్దండకు ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు.