నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు నుంచి బండమీదిగూడెం వెళ్లే ప్రధాన రహదారిని నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆదివారం అన్నారు. సిపిఎం మండల నాయకులతో కలిసి ఆదివారం ఊట్కూరు నుంచి బండమీదిగూడెం వెళ్లే రహదారిని పరిశీలించారు ప్రధానంగా బండమీద కూడా గ్రామానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా ఉందని రోడ్లన్నీ గుంతల మయంగా మారిందని వెంటనే రోడ్డును నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చలకాని మల్లయ్య కందాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.