సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ మైదానంలో శుక్రవారం క్రీడా పోటీలను నిర్వహించారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతగా నిలిచిన సంగారెడ్డి జట్టుకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు