మిర్చి యార్డులో ముఠా కార్మికులకు కూలి రేట్లు పెంచాలని కోరుతూ బుధవారం ఉదయం సమ్మెకు దిగారు. దీంతో మిర్చి యార్డ్ మొత్తం స్తంభించిపోయింది. దీనికి అనుబంధంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలు, మిర్చిగూడాలు, కారం మిల్లులలో కూడా పని స్తంభించిపోయింది. మొత్తంగా 10,000 మంది కార్మికులు సమ్మెలో భాగస్వామయ్యారు. ప్రతి రెండు సంవత్సరాలకి పెరగాల్సిన కూలి నాలుగు నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడంతో అధికారుల దృష్టికి, యాజమాన్యం దృష్టికి కాళ్లు అరిగేటట్లు తిరుగి వారి దృష్టికి సమస్య తీసుకు వెళుతున్నా పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించి మిర్చి యార్డ్ కార్మికులు సమ్మెకు దిగారు.