శ్రీకాకుళం జిల్లా మందస మండలం పట్టులోగాంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్య నెలకొన్న వర్గపోరు విద్యార్థినుల చుట్టుముడుతుంది. దీంతో పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అక్కడ సమస్య ఎప్పటికి సద్దుమణగకపోవడంతో వారి పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో గత రెండు రోజులుగా అక్కడ పరిస్థితి ఉదృక్తంగా మారింది. మధ్యాహ్నం తరగతులను బహిస్కరించి తల్లిదండ్రులతో కలిసి న్యాయం చేయాలంటు పాఠశాల గేటు వద్ద బైటాయించడంతో ఉన్నతాధికారులలో కదలిక వచ్చింది. ఇన్చార్జి హెచ్ ఎం గా ఉన్న రాజేశ్వరి కి మరో ముగ్గురు టీచర్లు మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చ కేక్కయి.