బాల్య వివాహలు జరగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. ఓర్వకల్ లో శనివారం నిర్వహించిన న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గిరిజన హక్కుల సంక్షేమ చట్టాలపై ప్రసంగించారు. ఈ సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ రాధిక, ఎంపీడీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు....