చిత్తూరు: వివాహిత మృతిపై కేసు నమోదు వివాహిత మరణంపై ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ మహేశ్వర గురువారం తెలిపారు. ఆరిమాకులపల్లికి చెందిన అరుణ్ కుమార్, 190 రామాపురానికి చెందిన అశ్వికకు 10 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిట్టూరులో కాపురం పెట్టారు. బుధవారం రాత్రి ఆమెలో చలనం లేకపోవడంతో భర్త అశ్విక తండ్రికి తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.