తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని సాధించే దిశగా పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని అయితే తర్వాత రోజే టిడిపి అద్భుతమైన పార్టీ అని కొనియాడరని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుందో నాయకులు గుర్తించాలని అన్నారు. టిడిపిని ఎలా పొగుడుతావు రేవంత్ రెడ్డి అని ఆమె ప్రశ్నించారు.