వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు స్వగ్రామం ఈపూరు మండలం ఇనిమెళ్ళ గ్రామంలో ప్రభుత్వ భూములతో పాటు స్మశాన భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో పేర్కొన్నారు. స్మశానం భూములను కూడా ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు.