అనంతపురం జిల్లా ముద్దలాపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కూడేరు మండలం మరుట్ల వన్ కు చెందిన అనిల్ కుమార్ అనే ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మరుట్లకు చెందిన అతను తన స్నేహితుడు ఏకాంతతో కలిసి డ్రిప్ పైపులను వేసుకొని గ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి బోల్తాపడడంతో అనిల్ కుమార్ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి కూడేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.