తెలంగాణ రాష్ట్రానికి యూరియా అందించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ డిసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకి కేంద్రం కేటాయించిన యూరియా 9.8 లక్షల టన్నులు, మళ్లీ మాట మార్చి ఇస్తానన్న యూరియా 8.3 లక్షల టన్నులు అదే కేంద్రం చివరికి తెలంగాణ రైతాంగానికి పంపిణీ చేసిన యూరియా ఐదు పాయింట్ 32 లక్షల టన్నులు అన్నారు. కాంగ్రెస్ను బద్దం చేస్తుందని మండిపడ్డారు.