Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పై ఉద్దేశపూర్వకంగా కొన్ని టీవీ ఛానల్లు, సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని గిరిజన సంఘ నాయకుడు గిరిధర్ తదితరులు అన్నారు. మంగళవారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో పలువురు గిరిజనులతో కలిసి మాట్లాడారు. ఇంజనీరింగ్ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ పట్టుబడగా అతని అవినీతితో మంత్రికి సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి చేరుకున్న గిరిజన బిడ్డపై ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నారు.