అనంతపురం నగర శివారులోని బుక్రాయసముద్రం సమీపంలో ఉన్న ముసలమ్మ ఆలయం వద్ద దొంగలు వింత వ్యవహారం ప్రదర్శించారు. ఒక నెల రోజుల క్రితం ఆలయంలో చోరీ చేసి హుండీని ఎత్తుకెళ్లారు. చేసిన తప్పు తెలుసుకుని దొంగతనం చేసినప్పటి నుంచి ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వేధిస్తోందన తమను క్షమించమని అర్జీ రాసి దొంగిలించిన సొమ్మును ఆలయంలో వదిలి వెళ్ళిన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ అంశం అత్యంత చర్చనీ అంశంగా మారింది.