రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేసింది. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల కలెక్టర్లు డాక్టర్ వినోద్ కుమార్, టీఎస్ చైతన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఆనంద్, సత్య సాయి జిల్లా కలెక్టర్ గా శ్యాం ప్రసాద్ నియమితులయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్లకు బదిలీ అయ్యారు.