యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుళ్ల గూడెం గ్రామంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో పేరుకుపోయిన నీరు మట్టిని వెంటనే తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి సిల్పొంగి స్వామి డిమాండ్ చేశారు గురువారం బ్రిడ్జి వద్ద నిరసన చేపట్టారు. పొద్దుటూరు ఎదుళ్లగూడెం గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే వారు కరువయ్యారని డిమాండ్ చేశారు వెంటనే పేరుకుపోయిన మట్టిని తొలగించి వరదనీరు సాఫీగా పోయేలా చర్యలు చేపట్టాలన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.