రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొండాపూర్ మండలం గుంతపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం.. శంకర్ పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన రాములు(50) బైక్ పై వెళుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ గుంతపల్లి శివారులో ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.