నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర పరిధిలో సోమవారం విషాదం నెలకొంది. మహానందికి వచ్చిన ఓ భక్తుడు మూర్చకు గురై కాలువలో పడి మృతి చెందాడు. స్థానిక కరివేన సత్రం ముందు భాగంలో కోనేటి నుంచి బయటికి నీరు వెళ్లే కాలువలో పడినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.