కెరమెరి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ ను ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై మధుకర్ కు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు.