మెంటాడ మండలంలోని ఇద్దనవలస విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ వినియోగదారులతో మేము అనే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ డి ఈ బి రఘు మాట్లాడుతూ, గ్రామాలలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే అంశాలపై సమావేశంలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ ఏడిఈ జి శివకుమార్, ఏఈ రమేష్, విద్యుత్ వినియోగదారులుతదితరులు పాల్గొన్నారు.