ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ద్వారా ఆదివాసీ ప్రాంతంలో రైతులకు పంపిణీ చేస్తున్న మొక్కలు నాసిరకం ఉన్నాయని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీలో శనివారం సరఫరా చేస్తున్న సిల్వర్ మొక్కలను పరిశీలించారు. పంపిణీ చేస్తున్న మొక్కలు కనీసం అడుగున్నర కూడా లేకపోవడంతో రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. నాణ్యమైన మొక్కలు పంపిణీ చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.