జాతి వైరం మరిచి స్నేహం చేస్తున్న కోతి కుక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కుక్క కోతి దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మనుషుల మధ్య సఖ్యత లేకపోవడం డబ్బు ముందు రక్తసంబంధాలే నిలబడక పోతున్న ఈ కలియుగంలో జాతి వేరు మరిచి స్నేహం చేశాయి ఓ కోతి కుక్క సుమారు గంటకు పైగా దోస్త్ మేరా దోస్త్ అంటూ చట్టపట్టాలేసుకుంటూ తిరిగుతూ ఆడుకున్నాయి, ఒకటి ఒకటి ఆ లింగనం చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ మురిపెంగా గంతులేశాయ్,ఈ ఘటన చూపరులను ఆకట్టుకుంది,స్నేహం సౌభ్రాతృత్వం అంతరించిపోతున్న ఈ తరుణంలో ఈ కుక్క కోతి స్నేహం మాత్రం ఆలోచింపచేసింది.