అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ నిరసన ర్యాలీలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.ర్యాలీగా చేరుకుని కలెక్టరేట్ లోకి ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్ళేందుకు యత్నించిగా పోలిసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు బిజెపి శ్రేణులకు మధ్య తోపులాట చేసుకుంది.ఈ తోపులాటలో ఓ మహిళ కానిస్టేబుల్ చేతికి గాయం అయ్యింది.కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.