గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు దారి తీసిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కారణాల నమోదుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలలో 20 మరణాలకు దారి తీసిన కారణాలను పరిశీలించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తో కలిసి గ్రామంలో పర్యటించారు