కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24గంటల్లో జిల్లాలో సగటున 24.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక ప్రకటన ద్వరా మిడియాకు తెలిపారు. నందివాడ మండలంలో అధికంగా 52.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అవనిగడ్డలో అత్యల్పంగా 6.2మిల్లీమీటర్లు నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎగువ ప్రాంతంలో గల పునరావాస కేంద్రాల్లో లొకి వెళ్లాలని హెచ్చరికలు జారీ చెసారు.