కాకినాడ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని కాకినాడ త్రిటౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులకు సంబంధించి ముగింపు ఉత్సవాలు, నిమర్జనోత్సవాల నేపధ్యంలో కాకినాడ జిల్లా ఎస్పి బింధుమాధవ్ ఆదేశాలమేరకు డిఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ సూచనలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సినిమారోడ్ లో ఉన్న కోకనాడ అన్నదాన సమాజంలో కాకినాడ త్రిటౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కెవి సత్