తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలలో సామాజిక సమానత్వం, విద్యా ఉపాధి వ్యాపారం సాంప్రదాయ పరిరక్షణ అవకాశాలు కల్పించాలని గోర్ బంజారా రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత మహమ్మద్ రఫీ గోవింద నాయక్ తదితరులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బంజారా సమాజం యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంత రాజ్యాధికారం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు.