కాళోజీ నారాయణ రావు చేసిన సేవలు మరువలేనివి తహసిల్దార్ రజనీకుమారి స్వరాష్ట్ర సాధన కోసం కాళోజీ నారాయణరావు చేసిన పోరాటం మరువలేనిదని రామాయంపేట తహశీల్దార్ రజనీకుమారి అన్నారు. మంగళవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ నారాయణ తెలంగాణ సాధన కోసం ఎంతో పోరాటం చేశారని, అయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.