పెరుగుతున్న విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్పూర్తితో విద్యుత్ స్మార్ట్ మీటర్ల్ రద్దుకై, ఐక్యంగా పోరాడుదాం..సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం కొత్తూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 2000 సంవత్సరంలో ఆగస్టు 28న విద్యుత్ చార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి లకు నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు..