రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధి లోని కటపుటాలమ్మ దేవాలయం సమీపంలో సోమవారం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని వారు తెలిపారు. డ్రైవర్ ను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.